Watch: భారీ గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి ఊగిపోతూ బోల్తా
fodder laden truck overturns | భారీ గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పింది. జాతీయ రహదారిపై ఊగిపోవడంతోపాటు బోల్తాపడింది. లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: భారీ గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పింది. జాతీయ రహదారిపై ఊగిపోవడంతోపాటు బోల్తాపడింది. లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (fodder laden truck overturns) మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశువుల మేతతో వెళ్తున్న ఒక లారీ జాతీయ రహదారి 52పై అదుపుతప్పింది. రోడ్డుపై ఊగిపోయిన ఆ లారీ కొంతదూరం అలాగే ప్రయాణించింది.
కాగా, జల్పా మాతా ఆలయం సమీపంలోని భక్తులు ఇది చూశారు. లారీని నిలుపాలంటూ డ్రైవర్‌ను అలెర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించారు. భారీగా ఊగిపోతున్న ఆ లారీ పరిస్థితిని గమనించారు. రహదారి రెండు వైపుల తమ వాహనాలు ఉంచి రాకపోకలను నిలిపివేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ గడ్డి లారీ రోడ్డుపై బోల్తాపడింది.
మరోవైపు పోలీసులు వెంటనే ఆ లారీ వద్దకు చేరుకున్నారు. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. విదిషా జిల్లాలోని సిరోంజ్ నుంచి రాజస్థాన్‌కు ఆ లారీ ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దానిని పైకి లేపేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భారీ గడ్డి లోడ్ లారీ రోడ్డుపై ఊగిపోతూ బోల్తాపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hay-Laden Truck Overturns on NH-52 in Rajgarh, Madhya Pradesh#truckoverturns #roadaccident #madhyapradesh #accident #viral pic.twitter.com/eSWtSpgjuI
— The Savera Times (@thesavera_times) March 20, 2026
Also Read:
cold storage collapses | కూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్.. నలుగురు మృతి, 12 మందికి గాయాలు
Arrow Pierces Monkey’s Neck | కోతి మెడలోకి దూసుకెళ్లిన బాణం.. నాలుగు రోజుల్లో రెండో దాడి
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

