Arrow Pierces Monkey’s Neck | కోతి మెడలోకి దూసుకెళ్లిన బాణం.. నాలుగు రోజుల్లో రెండో దాడి
Arrow Pierces Monkey's Neck | కోతులపై దాడులు పెరుగుతున్నాయి. వేటగాళ్లు బాణాలతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కోతి మెడలోకి బాణం చొచ్చుకెళ్లింది. గత నాలుగు రోజుల్లో ఇలాంటి దాడులు రెండు జరిగాయి. దీంతో జంతు ప్రేమికులు, అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై: కోతులపై దాడులు పెరుగుతున్నాయి. వేటగాళ్లు బాణాలతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కోతి మెడలోకి బాణం చొచ్చుకెళ్లింది. గత నాలుగు రోజుల్లో ఇలాంటి దాడులు రెండు జరిగాయి. దీంతో జంతు ప్రేమికులు, అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. (Arrow Pierces Monkey’s Neck) మహారాష్ట్రలోని థానే జిల్లాలో తాజా సంఘటన జరిగింది. థానేలోని ఒక ప్రాంతంలో కోతి మెడలోకి బాణం దిగింది. దీంతో బాధతో అది అల్లాడింది. గమనించిన స్థానికులు వన్యప్రాణి సంక్షేమ సంఘం, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాగా, థానే వన్యప్రాణి సంక్షేమ సంఘం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యెయూర్ రేంజ్ అటవీ శాఖ అధికారుల సహాయంతో ఆ కోతిని సురక్షితంగా పట్టుకున్నారు. మెడ ద్వారా ప్రవేశించిన బాణం దవడ దగ్గర నుంచి బయటకు వచ్చినట్లు గమనించారు. ఆ కోతిని పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వేటగాడు బాణంతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు నాలుగు రోజుల కిందట ముంబైలోని సంజయ్ గాంధీ జాతీయ పార్కు సమీపంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒక కోతి కడుపులోకి బాణం దిగింది. తీవ్రంగా గాయపడిన దానిని స్థానికులు గమనించారు. సమాచారం తెలుసుకున్న రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్, అటవీ శాఖ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. కోతిపై బాణంతో దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read:
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 2nd Attack
- arrow
- Maharashtra
- monkey
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

