NDA seat deal in Tamil Nadu | తమిళనాడులో ఎన్డీయే సీట్ల ఒప్పందం ఖరారు.. 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ
NDA seat deal in Tamil Nadu | త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.
చెన్నై: త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలైన అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకేకు 18, టీటీవీ దినకరన్కు చెందిన ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించారు.
కాగా, ఎన్డీయే కూటమిలో అంతర్గత చర్చలు సజావుగా సాగాయని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) తెలిపారు. సీట్ల కేటాయింపులు అధికారికంగా ఖరారయ్యాయని చెప్పారు. ఇతర పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, వారికి కేటాయించే సీట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఎన్డీయేను ‘విజయ కూటమి’గా ఆయన అభివర్ణించారు. అన్ని సీట్లలో విజయం సాధించి, ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని తిరస్కరిస్తారని బీజేపీ తమిళనాడు ఇన్చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీలో మాదిరిగానే తమిళనాడు ఓటర్లు ఎన్డీయేను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడును అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన దుష్ట శక్తి అయిన డీఎంకే, దాని భాగస్వాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
Also Read:
Kashmiris Donations To Iran | కశ్మీర్ ప్రజల విరాళాలు.. ఈ దయ మరువలేనిదన్న ఇరాన్
Watch: ఆలయంలో రెచ్చిపోయిన పూజారులు.. భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

