Hydraa High Court | నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా?.. హైడ్రా వ్యవహారంపై అధికారులను నిలదీసిన హైకోర్టు
Hydraa High Court | ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవద్ద ని తాము ఎప్పుడూ చెప్పలేదని, అయితే చట్టం నిర్దేశించిన విధానాన్ని విస్మరించి ప్ర జల హకులను కాలరాయడం సహించబోమని హైకోర్టు స్పష్టంచేసింది.
Hydraa High Court | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవద్ద ని తాము ఎప్పుడూ చెప్పలేదని, అయితే చట్టం నిర్దేశించిన విధానాన్ని విస్మరించి ప్ర జల హకులను కాలరాయడం సహించబోమని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వ భూమి పేరుతో కూల్చేముందు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని, సర్వే చేయాల ని చట్టం చెప్తుంటే వాటిని కాదని రాత్రికిరాత్రే ఎందుకు చర్యలు తీసుకుంటున్నార ని రెవెన్యూ అధికారులను ప్రశ్నించింది. ‘నోటీసులు ఇస్తే బాధితులు కోర్టును ఆశ్రయిస్తారని భయమా? ప్రజలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశమే లేకుండా చేస్తున్నారా?’ అంటూ గురువారం విచార ణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసిం ది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండ లం కొండాపూర్ సర్వే నంబర్ 60లోని 350 చదరపు గజాల స్థలంలో ఉన్న కం పౌండ్ గోడతోపాటు వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పె మ్మసాని సుధారాణి దాఖలు చేసిన రిట్ పి టిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్ శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. ప్ర భుత్వం దాఖలు చేసిన కౌంటర్లో కూడా పిటిషనర్‌కు ఎలాంటి నోటీసులు జారీచేసినట్టు ప్రస్తావన లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధ ప్రక్రియను పూర్తిగా విస్మరించి కూల్చారని పేరొన్నారు. దీనికి రెవెన్యూశాఖ తరఫున న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి స్పందిస్తూ, పిటిషనర్ స్థలానికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఉ త్తర్వులు జారీచేయలేదని తెలిపారు. సర్వే నంబర్ 59లోని 32 ఎకరాల ప్రభుత్వ భూమికి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు కంచె వేసే క్రమంలో మాత్రమే చర్యలు తీ సుకున్నామని చెప్పారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి, ‘పిటిషనర్ కం పౌండ్ ప్రభుత్వ భూమిలోనే ఉందని ఎవ రు నిర్ధారించారు? దానికి ఆధారం ఏమి టి?’ అని ఈ విచారణలో పాల్గొన్న ఎమ్మార్వోను ప్రశ్నించారు. ఒక స్థలాన్ని ప్రభుత్వ భూమిగా నిర్ధారించాలంటే ముందుగా అ ధికారిక సర్వే జరగాల్సిందేనని, మండల సర్వేయర్ నివేదిక ఉన్నదా? కూల్చివేతల సమయంలో సర్వేయర్ అకడే ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనికి ఎమ్మార్వో సమాధానమిస్తూ, కూల్చివేతల సమయంలో సర్వేయర్ లేరని, తాను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాధ్యతలు స్వీకరించానని, తన కు ముందు పనిచేసిన ఎమ్మార్వో వెంకటరెడ్డి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా నమో దు చేశారని తెలిపారు. ఈ వివరణతో అ సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, అప్పటి ఎ మ్మార్వోను పూర్తి రికార్డులతో హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

