హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్యల పరిషారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సూచించారు. వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా రాష్ట్రాలపై కేంద ప్రభుత్వం అదనపు ఆర్థికభారం మోపినప్పటికీ, ఫిక్స్ టెన్యూర్ ఉద్యోగుల (ఎఫ్‌టీఈ) చర్చలతో సుదీర్ఘకాల సమస్యల పరిషారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, చెప్పారు. జపాన్ తరహాలో ఎకువ పని చేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే మార్గాలు ఉన్నాయని, పని నిలిపివేయడం కంటే బాధ్యతాయుతమైన పద్ధతుల్లో సమస్యలను పరిషరించుకోవాలన్నారు.
హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఉపాధిహామీ ఎఫ్‌టీఈ జేఏసీ ప్రతినిధులతో మంత్రి సీతక గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పేసేల్ అమలు, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, బదిలీల విధానం, ఇతర సర్వీస్ అంశాలపై జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2006లో డీఎస్సీ ద్వారా ఎంపికై దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ పేసేల్ అమలు కాలేదని అన్నారు. పే సేల్ అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్చించి పరిషారానికి కృషి చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు. సమావేశంలో ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, ఎఫ్‌టీఈ జేఏసీ సభ్యులు ఎలబద్రి లింగయ్య, ఏ అంజిరెడ్డి, ఎం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.