సిటీబ్యూరో: యువ సంగీత దర్శకుడు నిహిత్ సంభవ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్ చదువుతున్న నిహిత్ స్వయంగా సంగీత దర్శకత్వం వహించి ‘కేటీఆర్ సన్ ఆఫ్ సార్.. కదిలే ఫైర్’ పాటను రూపొందించారు.
ఈ పాటకు ప్రస్తుతం విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా నిహిత్ ప్రతిభను కేటీఆర్ అభినందించారు.