ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో ఎల్బీ స్టేడియం నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులపై బీఆర్ఎస్వీ నేతలు మండిపడ్డారు.


