హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్టలో ఈ నెల 8,9,10న జరిగిన ఏఐవైఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏఐవైఎఫ్ జాతీ య కార్యదర్శి వలిఉల్లాహ్ ఖాద్రీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూరి ధర్మేంద్ర నూతన కమిటీని ప్రకటించారు. ఏఐవైఎఫ్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మర్రి శ్రీమా న్(ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా నేర్లకంటి శ్రీకాంత్(హైదరాబాద్), వరింగ్ ప్రెసిడెంట్‌గా రాము(మహబూబ్‌నగర్), డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా పేరబోయిన మహేందర్(యాదాద్రి), ఉపాధ్యక్షులుగా మానస్ కుమార్(పెద్దపల్లి), ఫహీం దాదా (కొత్తగూడెం), జనగాం రాజ్‌కుమార్(సిద్దిపేట), స్వప్న(మేడ్చల్), సహాయ కార్య దర్శులుగా టీ సత్యప్రసాద్(మేడ్చల్), లింగం రవి(మంచిర్యాల), చింతల రమేశ్ (ఖమ్మం), సాంబమూర్తి (వరంగల్), శివకుమార్(రంగారెడ్డి)తోపాటు 71 మంది కౌన్సిల్, 29 మందితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్టు ఖాద్రీ వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.
ట్యాంక్‌బండ్‌పై ఉన్న తెలంగాణ సాయుధ పోరాటయోధుడు ముఖ్దుం మొహియుద్దీన్ విగ్రహానికి పల్లా, కూనంనేని తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు ‘రెడ్‌షర్ట్ వలంటీర్ల’ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఐఎం, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని పల్లా ఆరోపించారు. రేవంత్డ్ ప్రభుత్వం కూడా పార్టీ పరంగానే ఈ దినోత్సవాన్ని జరుపుతున్నదే తప్ప, అధికారికంగా నిర్వహించడానికి నిరాకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.