హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ను కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రారంభించింది. ఈ నెల 14 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. 15న సీట్లు కేటాయిస్తామని, మేనేజ్మెంట్ కోటా కింద మొదటి విడత ఎంబీబీ ఎస్/బీడీఎస్ సీట్ల కేటాయింపును 16న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : నూనెగింజల పంటల ఉత్పాదకత పెంపు, ఆధునిక సాంకేతికతలను రైతులకు వేగంగా అందించేందుకు పరిశోధన, పరిశ్రమల అనుసంధానాన్ని బలోపేతం చేయాలని ఐఐవోఆర్ డైరెక్టర్ ఆర్ కే మాథుర్ పేరొన్నారు. ఐసీఏఆర్-భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ(ఐఐవోఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జాతీయ కన్సల్టెన్సీ అండ్ ఇండస్ట్రీ ఇంటర్ ఫేస్ మీట్ నిర్వహించారు.
ఐఐవోఆర్ అభివృద్ధి చేసిన నూనెగింజల రకాలు, హైబ్రిడ్లు, బయో ఆధారిత సాంకేతికతలను పరిశ్రమ ప్రతినిధులకు పరిచయం చేశారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యఅతిథిగా ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పీ వీ సత్యనారాయణ, ప్రత్యేక అతిథిగా మహా సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్స్వామి పాల్గొన్నారు.