లక్నో: కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మోనియా గ్యాస్ లీకేజీని అరికట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. (cold storage collapses) సోమవారం మధ్యాహ్నం ఒక కోల్డ్ స్టోరేజ్ భవనంలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అమ్మోనియా గ్యాస్ లీకేజీని అరికట్టారు.
కాగా, ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్సార్ అహ్మద్‌కు చెందిన కోల్డ్ స్టోరేజ్ అని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర మనస్తాపం చెందినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.
Also Read:
Arrow Pierces Monkey’s Neck | కోతి మెడలోకి దూసుకెళ్లిన బాణం.. నాలుగు రోజుల్లో రెండో దాడి