Gajendra Singh Shekhawat | ‘ఒక్క ఫోన్ కాల్ మీ ఉద్యోగాన్ని నాశనం చేస్తుంది’.. అధికారులకు కేంద్ర మంత్రి వార్నింగ్
Gajendra Singh Shekhawat | అధికారులపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారి అంతు చూస్తానని అన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ మీ ఉద్యోగాన్ని నాశనం చేస్తుంది’ అని హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: అధికారులపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారి అంతు చూస్తానని అన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ మీ ఉద్యోగాన్ని నాశనం చేస్తుంది’ అని హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Gajendra Singh Shekhawat) బీజేపీ పాలిత రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. ఫలోడి జిల్లా బాపిని గ్రామంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బీజేపీ కార్యకర్తలను ఏ అధికారి అయినా అమర్యాదగా చూస్తే ‘రెట్టింపు అమర్యాదతో’ తాను బదులిస్తానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆ అధికారి జీవితంతో పాటు వృత్తిని నాశనం చేస్తానని హెచ్చరించారు. ‘మీరు పార్టీ కార్యకర్తలతో అమర్యాదగా ప్రవర్తిస్తే, నేను మీతో కూడా రెట్టింపు అమర్యాదగా ప్రవర్తిస్తా. ఏ ఒక్క పార్టీ కార్యకర్తకూ మీరు హాని కలిగించలేరు. మీ జీవితాన్ని, ఉద్యోగాన్ని నేను నాశనం చేస్తా. కేవలం ఒక్క ఫోన్ కాల్తో మీ ఉద్యోగం పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అవసరం లేదని, కేవలం ఒక్క ఫోన్ కాల్ సరిపోతుందని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తన పార్టీ కార్యకర్తలు కూడా అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆ తర్వాత ఆయన సూచించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ తీరుకు ఇది నిదర్శమని కాంగ్రెస్ నేత టికారామ్ జుల్లీ విమర్శించారు. సీఎం పదవి రాకపోవడం వల్ల గజేంద్ర సింగ్ షెకావత్ అలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
डबल बदतमीजी करूंगा😳 आप मेरे कार्यकर्ता का कुछ नहीं बिगाड़ सकते लेकिन मैं आपकी नौकरी और जिंदगी दोनों खराब कर दूंगा😲 मैं 20 साल तक कहीं नहीं जाने वाला हूं🤔
– गजेंद्रसिंह शेखावत (केंद्रीय मंत्री) pic.twitter.com/VEO8AX8WjU— एक नजर (@1K_Nazar) March 22, 2026
Also Read:
cold storage collapses | కూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్.. నలుగురు మృతి, 12 మందికి గాయాలు
Arrow Pierces Monkey’s Neck | కోతి మెడలోకి దూసుకెళ్లిన బాణం.. నాలుగు రోజుల్లో రెండో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

