Anupama Parameswaran | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ ప్రముఖ యువ హీరోతో ఆమె ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అనుపమ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆమె తన గత రిలేషన్షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అనుపమ తన గత ప్రేమ గురించి మాట్లాడుతూ.. తాను ఒక సమయంలో ‘టాక్సిక్ రిలేషన్షిప్’లో ఉన్నానని వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బంధంలో తనకు ఎదురైన అనుభవాలు తనను ఎంతో బాధించాయని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తన మాజీ ప్రియుడు మొదట్లో ఒక వ్యక్తిలా కనిపించినప్పటికీ, ఆ తర్వాత పూర్తిగా మరో వ్యక్తిలా తన అసలు స్వభావాన్ని చూపించాడని అనుపమ పేర్కొన్నట్లు సమాచారం.అనుపమ చేసిన వ్యాఖ్యల్లో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ఎక్స్ లవర్ తన కెరీర్ విషయంలో కూడా ఆంక్షలు విధించేవాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాల ప్రమోషన్స్‌కు వెళ్లడం విషయంలో కూడా తనను నియంత్రించేవాడని, తన వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకునేవాడని అనుపమ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఒక రిలేషన్షిప్లో ప్రేమతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ముఖ్యమని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం.
ఇక అనుపమ వెల్లడించిన మరో విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రిలేషన్షిప్ మొదలైన కేవలం మూడు నెలల్లోనే పెళ్లి గురించి ఇరు కుటుంబాల్లో చర్చలు కూడా జరిగిపోయాయని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ బంధం ఎంత సీరియస్‌గా కొనసాగిందనే దానిపై ఆసక్తి పెరిగింది.అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని, తాను ఊహించిన వ్యక్తి తన ఎక్స్ కాదని అర్థమైందని అనుపమ చెప్పినట్లు సమాచారం. చివరకు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుపమ తన ఎక్స్ లవర్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అసలు చర్చ అంతా ‘ఆ అపరిచితుడు ఎవరు?’ అనే ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. గతంలో అనుపమతో రిలేషన్షిప్ ఉందంటూ ప్రచారం జరిగిన కొందరు యువ హీరోల పేర్లను నెటిజన్లు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు.