Karate Kalyani | పావలా శ్యామల కూతురికి ‘మా’ అండ.. ఏడాది పాటు ఫిజియోథెరపీ, ఆ తర్వాత మాత్రం.. !
Karate Kalyani | సీనియర్ నటి పావలా శ్యామల ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కుమార్తె మాధవి ఒంటరిగా మిగిలారు.
Karate Kalyani | సీనియర్ నటి పావలా శ్యామల ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కుమార్తె మాధవి ఒంటరిగా మిగిలారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాధవి పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాధవి బాధ్యతను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (MAA) తీసుకుంటుందని నటుడు రఘుబాబు గతంలో వెల్లడించారు. తాజాగా ‘మా’ ఈసీ సమావేశంలో మాధవి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు నటి, ‘మా’ జాయింట్ సెక్రెటరీ కరాటే కళ్యాణి వెల్లడించారు.
మంచు విష్ణు అధ్యక్షతన ఇటీవల ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పావలా శ్యామలకు నివాళులు అర్పించిన అనంతరం ఆమె కుమార్తె మాధవి పరిస్థితిపై చర్చించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. మాధవి ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించాలని కమిటీ నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించామని, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారని తెలిపారు. మాధవికి ఎంత ఖర్చయినా సరే ఏడాది పాటు ఫిజియోథెరపీ చేయించాలని ‘మా’ నిర్ణయించినట్లు కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమె తిరిగి తన కాళ్లపై తాను నడిచే స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
ఏడాది పాటు అవసరమైన వైద్య సహాయం, ఫిజియోథెరపీ అందించిన తర్వాత మాధవి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఆమెను ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే మాధవిని జీవితాంతం పోషించే బాధ్యతను ‘మా’ తీసుకోలేదని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. ‘మా’ ప్రధాన బాధ్యత కళాకారుల సంక్షేమాన్ని చూడటమే తప్ప, వారి కుటుంబ సభ్యులందరి జీవితకాల బాధ్యతను తీసుకోవడం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది సీనియర్ నటులు, కళాకారులు మరణించిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. వారి పిల్లల బాధ్యతను కూడా ‘మా’ జీవితాంతం తీసుకోలేదని చెప్పారు. అందువల్ల ఈ విషయంలోనూ ఒక పరిమితి ఉండాల్సిందేనని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే మాధవి ప్రస్తుతం పూర్తిగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందున, మానవతా దృక్పథంతో ఆమెకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు.
పావలా శ్యామల మృతి అనంతరం ఆమెకు సంబంధించిన అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలను కూడా ‘మా’ సహకారంతో సక్రమంగా నిర్వహించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. ఈ విషయంలో తనకు పలువురు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

