Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో ఇళ్లు కూలిపోయి ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు(Heavy rains) జనజీవనాన్నిస్తంభింపజేస్తున్నాయి. వర్షాలకు సిర్మౌర్ జిల్లాలో ఒక నివాస గృహం(Houses collapsed )కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) తెలిపింది. మౌజా పిసి డిడాగ్లోని చిచ్ఛడియాకు చెందిన భీమ్ సింగ్ నివాస గృహం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ఇంటి లోపల చిక్కుకుపోగా, స్థానిక గ్రామస్తుల సహాయంతో వారిని బయటకు తీశారు. భీమ్ సింగ్ భార్య నిర్మల (60), కుమార్తె పూజ (32) మరణించగా హీరా( 2), అభియానా (2) అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు పిల్లలను రాజ్‌గఢ్‌లోని సివిల్ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు లేదా ఇతర ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కాగా, అధికారిక నివేదిక ప్రకారం భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ అంతటా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూనే ఉన్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 204 రోడ్లు మూసుకుపోయాయి. గత 43 రోజుల్లో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన మొత్తం నష్టం రూ. 910 కోట్లు దాటింది. పదేపదే కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్ఫోటనాలు, ఇతర వాతావరణ సంబంధిత సంఘటనల కారణంగా రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా వ్యవస్థలు,ప్రైవేట్ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

