KTR | జాతిని మేల్కొలిపిన నాయకుడు కేసీఆర్.. ఆ సినిమా వాళ్లు మనపార్టీకి సంబంధం లేనివాళ్లు : కేటీఆర్
KTR | గత 10-11 రోజులుగా హైదరాబాద్లో ఒకాయనకు నిద్రపడ్తలేదు. ఆయనెవరో మీకు తెలుసు.. విచిత్రమైన పరిస్థితి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్లు పెట్టి మీరు ఏ పాట పెట్టుకోవాలే.. ఏ పాట పెట్టుకోవద్దు. అంటే నేను నమ్మలేకపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అన్నారు.
KTR | రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సరిగ్గా మనకు ఇంకో 2,3 నెలలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతుంది. మూడేళ్లలో ఏం జరుగుతుందని.. ప్రజలేమనుకుంటున్నరని చెప్పడానికి చిన్న ఉదాహరణ.. గత 10-11 రోజులుగా హైదరాబాద్లో ఒకాయనకు నిద్రపడ్తలేదు. ఆయనెవరో మీకు తెలుసు.. విచిత్రమైన పరిస్థితి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్లు పెట్టి మీరు ఏ పాట పెట్టుకోవాలే.. ఏ పాట పెట్టుకోవద్దు. అంటే నేను నమ్మలేకపోయిన. పోలీసులు చేయాల్సిన పనేంది.. శాంతి భద్రతలను పరిరక్షించాలే. ఎక్కడన్నా దొమ్మీలు జరిగినా.. జరగకూడని సంఘటనలు ఏమైనా జరిగితే వాటిని నివారించే ప్రయత్నం చేయాలే.. అనుకోని సంఘటనలు జరిగే వెంటనే నేరస్థులను పట్టుకొని లోపాలేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు ఏం చేస్తున్నరు.. ఒకటే పని చేస్తున్నరు. డీజేలు బంద్ చేసే పని చేస్తున్నరని అన్నారు. .
తెలంగాణలో వాళ్లకు అర్థం కావట్లేదు.. ఈ నేల స్వభావమేందంటే సందర్భమొస్తే గడ్డిపోచ కూడా గడ్డపారై తిరగబడతదనే విషయం మరిచిపోతున్నరు. అందుకే పోలీసోళ్లు పోయి కొడ్తున్నరు.. బాక్సులు గుంజేస్తున్నరు. కానీ పిల్లలు మాత్రం అదే సజ్జనార్ ముందు.. అదే కిషన్ రెడ్డి ముందు ఆగుతుర్రా.. దేఖ్ లేంగే ఏం చేస్కుంటవో చేసుకో పో అని కేసీఆర్ యాది చేసుకుంటూ ఉన్నరని కేటీఆర్ గుర్తు చేశారు.
10 రోజులు గణేశ్ నిమజ్జనం అయిపోయింది.. అని రేవంత్ రెడ్డి ఇక పండుకుందామనుకున్నడు.. కానీ ఇంకో సినిమా వచ్చింది.. మళ్లీ కొంప కుచ్చుకున్నది. నేను, జగదీషన్న, కౌశిక్ రెడ్డి అందరం కలిసి పోయినం. అందులో సినిమా మొత్తం 3 గంటలు.. కేసీఆర్ వచ్చింది 4 నిమిషాలు. కానీ ఆ 3 గంటలు ఒక ఎత్తు.. ఈ 4 నిమిషాలు ఒక ఎత్తు అన్నట్టు ఉంది కథ. ఇవాళ ఆ సినిమా తీసిన తమ్ముడెవరు, ఆ సినిమాలో ఉన్నవాళ్లెవరు మన పార్టీకి సంబంధం లేని వాళ్లు.. కానీ తమకు స్వేచ్చా స్వాతంత్య్రాన్ని ఇచ్చిన ఒక నాయకుడిని, తమకు గొంతును ఇచ్చిన నాయకుడిని.. ఒక జాతిని మేల్కోలిపిన నాయకుడిని తెలంగాణ ఎట్లా యాదిచేసుకుంటున్నదో మన కండ్ల ముందు కనిపిస్తున్నది. మనం బాధపడాల్సిన అవసరం లేదు.. భయపడాల్సిన అవసరం లేదు.. పోయింది అధికారం మాత్రమే. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఇంకా అనురాగం, మమకారం అట్లే ఉంది. ఎక్కడా కూడా ఒక సెకన్ కూడా తగ్గలేదు. ఇది వాస్తవం.. ప్రతీ అడుగులో కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నరన్నారు.
LIVE: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు. https://t.co/ssLQ0OF9hr
— BRS Party (@BRSparty) September 27, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

