Banks | ఆదివారం అయినా.. బ్యాంకులు తెరుచుకున్నాయ్!
సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ 27న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి.
కారేపల్లి,సెప్టెంబర్ 27 : సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ 27న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా (ఆదివారం) నేడు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచారు. దీంతో ఆదివారం కూడా బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారుల సందడి కనిపించింది. నగదు జమ, నగదు ఉపసంహరణ, చెక్కులు, ఖాతాలకు సంబంధించిన ఇతర సాధారణ సేవలను వినియోగించుకునేందుకు పలువురు ఖాతాదారులు బ్యాంకులకు వచ్చారు.
సాధారణ సెలవు రోజున బ్యాంకులు పనిచేయడంతో అత్యవసర లావాదేవీలు ఉన్న వారికి కొంతమేర ఊరట లభించింది. మరోవైపు మూడు రోజుల సమ్మె కారణంగా సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ఖాతాదారులు ముందుగానే అవసరమైన లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ శాఖలో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది బ్యాంకు, శాఖను బట్టి మారవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

