బెంగళూరు: వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక వ్యక్తి భార్య తల నరికాడు. తెగిన తలను చేతపట్టుకుని బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. (Man Beheads Wife, Carries Head) పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల శంకర్, 26 ఏళ్ల మానసకు మూడేళ్ల కింద ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉన్నది. హీలలిగే ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
కాగా, జూన్ 3న రాత్రి వేళ శంకర్ పనికి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వస్తానని భార్య మానసకు చెప్పాడు. అయితే పని ముగించుకుని ఊహించని విధంగా అర్ధరాత్రి వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య మానస మరో వ్యక్తితో ఉండటం చూసి ఆగ్రహించాడు. అతడితో వివాహేత సంబంధంపై గొడవ జరుగడంతో మానస ఇంటి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు మానస ఆ తర్వాత పలుమార్లు ఆ ఇంటికి తిరిగి వచ్చింది. భర్త శంకర్‌ను వేధించింది. జూన్ 5న మళ్లీ ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రాత్రి వేళ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన శంకర్ భార్య మానస తల నరికాడు. తెగిన తలతో బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మానస మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: