పాట్నా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఒక యువతి మాట్లాడింది. ఆయన మాదిరిగా తాను కూడా పెళ్లి చేసుకోబోనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని ఆ మహిళ అన్నది. (Rahul Gandhi With Bihar Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూన్ 6న రాహుల్ గాంధీ బీహార్ పర్యటన సందర్భంగా గయలో జరిగిన మహిళా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్యాడ్ గర్ల్’గా పిలిచే రియా పాస్వాన్, ఆయన మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
కాగా, మురికివాడ ప్రాంతాల ప్రజల చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి తమ బృందం ప్రయత్నిస్తున్నట్లు రియా తెలిపింది. విద్య వంటి పలు రంగాలను మెరుగుపరచడానికి రాజకీయాలు మొదటి అడుగు అని చెప్పింది. అయితే చాలా మంది, ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావడం లేదని అన్నది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాంగ్రెస్ చేపట్టిన శక్తి అభియాన్ వల్లే జీవితంలో పురోగతి సాధించినట్లు ఆమె వివరించింది.
మరోవైపు, రియా ఆత్మవిశ్వాసానికి రాహుల్ గాంధీ ముగ్ధుడయ్యారు. ‘మీరు మంచి ప్రసంగాలు ఇస్తారు’ అని ప్రశంసించారు. దీనికి రియా బదులిచ్చింది. ‘మీలాగే, నేను కూడా పెళ్లి చేసుకోకూడదని ఆలోచిస్తున్నా’ అని అన్నది. దీంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వారు. అలాగే ‘ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా. నేను రాజకీయాల్లో చేరాలనుకుంటున్నా. ఎందుకంటే నేను శక్తి అభియాన్లో ప్రవేశించినప్పుడు, రాజకీయాలు అంటే ఏమిటో నాకు అర్థమైంది’ అని ఆమె అన్నది. 2022లో ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ గురించి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాను ప్రశ్నించినప్పటి నుంచి రియా పాపులర్ అయ్యింది.
‘मैं भी आपकी तरह शादी नहीं करना चाहती’:गयाजी में महिला संवाद में बोली स्लम में रहने वाली लड़की, मुस्कुराकर देखते रहे राहुल गांधी#CongressNews #Bihar #BiharNews #RahulGandhi pic.twitter.com/xR16TOWzyN
— FirstBiharJharkhand (@firstbiharnews) June 6, 2025
Also Read: