Kalki 2 Shooting | శరవేగంగా కల్కి 2 షూటింగ్.. రాత్రి వరకు కష్టపడుతున్న అమితాబ్, కమల్!
Kalki 2 Shooting | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
Kalki 2 Shooting | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భారతీయ చలనచిత్ర దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గోంటున్న విషయం తెలిసిందే. అయితే సెట్స్‌లో వీరిద్దరి పనితీరు చూసి యూనిట్ సభ్యులు అవాక్కవుతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్లో పాల్గొంటూ, ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న క్రమశిక్షణ అందరిని షాక్‌కి గురిచేస్తుందటా. అయితే ఈ కీలకమైన షెడ్యూల్ వచ్చే నెల మార్చి 12 వరకు కొనసాగనుంది.
ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో కల్కి సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అమితాబ్, కమల్ హాసన్ మధ్య ఉండే హై-వోల్టేజ్ సన్నివేశాలను నాగ్ అశ్విన్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, సీక్వెల్లో ఒక భారీ మార్పు జరిగే అవకాశం ఉంది. మొదటి భాగంలో సుమతిగా మెప్పించిన దీపికా పదుకొనే స్థానంలో, రెండో భాగంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

