Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని అరక్కోణం తాలుకా మిట్టపిట్టై గ్రామానికి చెందిన నటరాజన్, మునిరత్నం శ్రీవారి దర్శనం కోసం బైక్‌పై తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద వారి వాహనం అదుపుతప్పింది. అతి వేగంగా వెళ్తున్న బైక్ నేరుగా రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం జరగడంతో నటరాజన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
యాక్సిడెంట్‌ను గమనించిన ఇతర భక్తులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన మునిరత్నం అనే వ్యక్తిని అంబులెన్స్‌లో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

