ఢిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్‌లో అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ముగిసిన ర్యాపిడ్ విభాగంలో 12 పాయింట్లతో ప్రజ్ఞానంద అగ్రస్థానంతో ముగించాడు. 9, 10 రౌండ్లలో ఓడినప్పటికీ ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ సిందరొవ్ (11 పాయింట్లు) కంటే ఒక పాయింట్ ఆధిక్యంతో ర్యాపిడ్‌లో తొలి స్థానాన్ని దక్కించుకోగలిగాడు. బ్లిట్జ్‌లోనూ రాణించగలిగితే ఈ ఏడాది ఆఖర్లో జరిగే గ్రాండ్ చెస్ టూర్ (జీసీటీ) ఫైనల్ బెర్తు దక్కించుకోగలుగుతాడు.