TMC: టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తు తేల్చేందుకు ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
TMC: టీఎంసీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీఎంసీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీఎంసీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టంది. పార్టీ పేరు, గుర్తు అంశంలో బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. అయితే టీఎంసీకి చెందిన రెండు వర్గాలు తమ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం ముందు నాలుగు వారాల్లోగా సమర్పించాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఇక ఈ అంశాన్ని మూడు నెలల్లోగా తేల్చాలని కూడా ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అల్టిమేటం జారీ చేసింది. టీఎంసీ పేరు, పార్టీ సింబల్‌ను ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించారు. అయితే రెండు వర్గాలకు ఈసీ రెండు రకాల పేర్లు, గుర్తులను ఇటీవల కేటాయించింది. అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజినగర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇది కీలకాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

