‘బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధే ‘బాస్’ లక్ష్యం’
బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ అండ్ సర్వీస్ (బాస్) పని చేస్తుందని, ప్రభుత్వం బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలను అందజేయాలని బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగు రాఘవరావు అన్నారు. నల్లగొండలోని పానగల్లులో గల శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో....
– నల్లగొండలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమావేశం
– హాజరైన బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగు రాఘవరావు
రామగిరి, సెప్టెంబర్ 28 : బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ అండ్ సర్వీస్ (బాస్) పని చేస్తుందని, ప్రభుత్వం బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలను అందజేయాలని బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగు రాఘవరావు అన్నారు. నల్లగొండలోని పానగల్లులో గల శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆ సంఘం ముఖ్య ప్రతినిధుల సమావేశానికి రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి కోసం బాస్ పని చేస్తోందని తెలిపారు. శాఖాపరమైన భేదాలు లేకుండా ఏ బ్రాహ్మణ కుటుంబానికి ఆపద వచ్చినా స్థానికంగా ఉన్న సంఘాల సహకారంతో బాస్ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌లో వినాయక విగ్రహం వద్ద జరిగిన ఘటనలో ఓ బ్రాహ్మణుడు అకాల మృత్యువాత పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మృతుడి కుటుంబానికి బాస్ తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అంతకుముందు శ్రీ పచ్చల సోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు చేశారు.
బాస్ కార్యక్రమాలకు అండగా ఉంటాం : బొల్లా వేణుగోపాలరావు
అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు మాట్లాడుతూ.. బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ అండ్ సర్వీస్ అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఆశయాలు, లక్ష్యాలు తమకు నచ్చాయని తెలిపారు. బాస్ నిర్వహించే కార్యక్రమాలకు తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సంస్థ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నవీన్ శర్మ, పులియాల యాదిగిరిరావు, సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ, గుండ్లపల్లి వెంకటేశ్వరరావు, దివాకర్ శర్మ, వినోద్ కుమార్, బాస్ ప్రతినిధులు భూపతి లక్ష్మీ, నవీన్ కుమార్, వేముల రవికుమార్, జనగాం ఉమాశంకర్ రావు పాల్గొన్నారు.

‘బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధే ‘బాస్’ లక్ష్యం’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- boss
- Brahmins
- Nalgonda News
- Panagal
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

