చింతపల్లి, సెప్టెంబర్ 27 : నల్లగొండలో ఈ నెల 27న నిర్వహించిన 11వ తెలంగాణ కరాటే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ (నేషనల్ కరాటే టోర్నమెంట్)లో చింతపల్లి మండలానికి చెందిన మహర్షి స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో జె.సంకీర్తన కుమార్ గోల్డ్ మెడల్, జి.వర్షన్ సిల్వర్ మెడల్ సాధించారు. విద్యార్థులకు ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి, ఫౌండర్ గోవింద్ గిరి, కరస్పాండెంట్ భోగరాజు మధుసూదన్, ప్రిన్సిపాల్ వినీత్ కృష్ణ, కరాటే కోచ్ మాస్టర్ కొండ్రపల్లి సురేష్, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.