Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం లేదు.
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. ఏకంగా దరఖాస్తులను క్యాన్సిల్ చేసేశారు. దీంతో అయోమయంలో పడిపోయిన రైతన్నలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో భూమి సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 60 వేల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే మిగిలిన దరఖాస్తులను ఎటువంటి కారణం లేకుండానే క్యాన్సిల్ చేసేశారు. దీంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ దరఖాస్తు క్యాన్సిల్ చేశారని చెబితే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన కారణం చెప్పకుండా దరఖాస్తులు తిరస్కరించడమేంటని మండిపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను కనీసం పోర్టల్‌లో కూడా అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

