Anakapalli | ‘అనకాపల్లి’ని వినూత్నంగా రిలీజ్ .. ప్రేక్షకుల తీర్పు తర్వాతే వైడ్‌గా రిలీజ్!
Anakapalli | టాలీవుడ్లో ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వాటిలో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘అనకాపల్లి’ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినిమాలు ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా లేదా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. కానీ ‘అనకాపల్లి’ చిత్ర బృందం మాత్రం అందుకు భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకుంది.
Anakapalli | టాలీవుడ్లో ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వాటిలో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘అనకాపల్లి’ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినిమాలు ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా లేదా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. కానీ ‘అనకాపల్లి’ చిత్ర బృందం మాత్రం అందుకు భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ సినిమాను అనకాపల్లి ప్రాంతంలో మాత్రమే విడుదల చేసి, అక్కడి ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ఇతర ప్రాంతాల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ దర్శకుడు నక్కిన త్రినాథరావు కథను అందించడంతో సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తొలి షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం, చివరి నిమిషంలో రిలీజ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చేసింది. తాజాగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా అనకాపల్లి ప్రాంతం నేపథ్యంలో రూపొందింది. అందుకే ముందుగా అక్కడి ప్రజలకే చూపించాలని నిర్ణయించుకున్నాం. వారి స్పందనను గౌరవిస్తూ, తర్వాత మిగతా ప్రాంతాల్లో విడుదల చేస్తాం” అని తెలిపారు. ఈ నిర్ణయం చిన్న సినిమాలకు కొత్త తరహా ప్రమోషన్ స్ట్రాటజీగా మారింది.
సాధారణంగా పెద్ద సినిమాలకు మాత్రమే ప్రీమియర్ షోలు లేదా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. కానీ ఒకే ప్రాంతంలో పూర్తి స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేయడం అరుదైన విషయంగా మారింది. దీంతో ‘అనకాపల్లి’ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా అనకాపల్లి ప్రాంత ప్రజలు ఈ చిత్రాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్ సరసన సంధ్య వశిష్ట హీరోయిన్గా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప, ఇంద్రజ, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్థానికత, భావోద్వేగాలు, సహజమైన పాత్రలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అనకాపల్లి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తే, త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ వినూత్న రిలీజ్ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ‘అనకాపల్లి’ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

