బెంగళూరు: భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలింది. ఆ ప్రాంతంలో వర్షం నీరు నిలిచి ఉండటంతో ఎదురుగా ఉన్న ఇంట్లోకి భారీగా వర్షం నీరు ప్రవాహించింది. (Dramatic water burst) వర్షం నీటి ప్రవాహం ధాటికి ఆ ఇంటి గేటు విరిగిపడింది. అలాగే విద్యుత్ స్పార్క్స్ కూడా కనిపించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాతో సహా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా, శనివారం మంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాలకు ఒక ఇంటి కాంపౌండ్ గోడ కూలిపోయింది. వీధిలోని రోడ్డుపై నిలిచి ఉన్న వర్షం నీటిలో అది పడింది. దీంతో ఆ వర్షం నీరు పెద్ద ప్రవాహం మాదిరిగా ఎదురుగా ఉన్న ఇంట్లోకి చేరింది.
మరోవైపు ఆ వర్షం నీటి ఉధృతికి ఆ ఇంటి గేటు విరుగడంతోపాటు దూరంగా పడింది. అలాగే విద్యుత్ పోల్ దెబ్బతినడంతో స్పార్క్స్ కూడా వచ్చాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఇది చూసి ఆ ఇంటి వారు భయాందోళన చెందారు. ఆ ఇంటి ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Heavy Rains lash out in Mangalore
Stay safe everyone in Mangalore #MangaloreRains #KarnatakaRains #Mangaluru #Karnataka pic.twitter.com/szNzNwaQlY
— No Context Karnataka (@NoContextKtaka) June 15, 2025
Also Read:
Tej Pratap | కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం
Watch: జిప్లైన్పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Air India Plane Crash | కూలిన ఎయిర్ ఇండియా విమానం నిర్వహణలో మా సంస్థకు సంబంధం లేదు: టర్కీ