అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం (Air India Plane Crash) నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. టేకాఫ్ సమయంలో కూలిన ఎయిర్ ఇండియాకు చెందిన ‘బోయింగ్ 787-8 విమానం నిర్వహణను టర్కిష్ టెక్నిక్ సంస్థ చేపట్టినట్లుగా వస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలిపింది. టర్కీ, భారత్ మధ్య సంబంధాలపై ప్రజల్లో దురాభిప్రాయం కలిగించే తప్పుడు సమాచారమని ఆరోపించింది.
కాగా, ఎయిర్ ఇండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య 2024-2025లో జరిగిన ఒప్పందాల ప్రకారం బీ777 వైడ్ బాడీ విమానాలకు ప్రత్యేకంగా నిర్వహణ సేవలు అందిస్తున్నట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ‘ఈ రోజు వరకు టర్కిష్ టెక్నిక్ ఈ రకమైన ఏ ఎయిర్ ఇండియా విమానానికి నిర్వహణ బాధ్యత నిర్వహించలేదు’ అని పేర్కొంది.
మరోవైపు కూలిన ఎయిర్ ఇండియా విమానానికి ఏ కంపెనీ చివరిగా సర్వీస్ చేసిందో అన్నది తమకు తెలుసని టర్కీ తెలిపింది. అయితే విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో మరిన్ని ఊహాగానాలను నివారించడానికి ఆ సంస్థ పేరును వెల్లడించడంలేదని టర్కీ చెప్పింది. విషాదకరమైన విమాన ప్రమాదంపై భారత ప్రజల దుఃఖాన్ని టర్కీ ప్రజలు హృదయపూర్వకంగా పంచుకుంటున్నారని పేర్కొంది.
Also Read:
విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు.. రాజ్‌కోట్‌లో అంత్యక్రియలు..!
కేదార్నాథ్ నుంచి వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్.. పైలట్ సహా ఏడుగురు దుర్మరణం
Watch: రోడ్డు దాటుతున్న గుర్రాన్ని ఢీకొట్టిన బైక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?