NZ vs SA | అలెన్ బౌండరీల సునామీలో కొట్టుకుపోయిన దక్షిణాఫ్రికా.. చరిత్రాత్మక విజయంతో ఫైనల్లో న్యూజిలాండ్..!
NZ vs SA : లీగ్ ఆసాంతం అదరగొట్టి.. ఆఖర్లో తడబడిన దక్షణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకుంది. సూపర్ 8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచిన.. సఫారీలను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిన్ అలెన్(100 నాటౌట్) బౌండరీల సునామీలో ప్రొటీస్ జట్టు కొట్టుకుపోయింది.
NZ vs SA : లీగ్ ఆసాంతం అదరగొట్టి.. ఆఖర్లో తడబడిన దక్షణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకుంది. సూపర్ 8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచిన.. సఫారీలను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిన్ అలెన్(100 నాటౌట్) బౌండరీల సునామీలో ప్రొటీస్ జట్టు కొట్టుకుపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో అలెన్ చిరస్మరణీయ సెంచరీతో చెలరేగగా.. పొట్టి ప్రపంచకప్‌లో తొలిసారి దక్షిణాఫ్రికాపై విజయంతో చరిత్ర లిఖించింది కివీస్. విన్నింగ్ షాట్‌తో అలెన్ శతకం పూర్తి చేసుకోగా 9 వికెట్ల విజయంతో దర్జాగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది బ్లాక్‌క్యాప్స్.
టీ 20 ప్రపంచకప్‌ను ముద్దాడాలనుకున్న దక్షిణాఫ్రికా కల చెదిరింది. లీగ్ దశ నుంచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టిన సఫారీ జట్టును అనామక జట్టులా ఓడించింది న్యూజిలాండ్. పొట్టి కప్‌లో గతంలో ఐదుకు ఐదుసార్లు ఓడిన కివీస్.. సంచలన ఆటతో ప్రొటీస్ జట్టుకు నాకౌట్ పంచ్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో సంజూ శాంసన్ అజేయ అర్ధశతకం(97 నాటౌట్)తో భారత్‌ను గెలిపించిన చోట.. ఫిన్ అలెన్(100 నాటౌట్) విధ్వంసక సెంచరీతో బ్లాక్ క్యాప్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన కివీస్.. అనూహ్యంగా పుంజుకొని టైటిల్ పోరుకు దూసుకెళ్లడం విశేషం.
5 Fastest 100s in the T20 World Cups:
1) Finn Allen 🇳🇿 – 33 balls
2) Chris Gayle 🏝️ – 47 balls
3) Harry Brook 🏴 – 50 balls
4) Chris Gayle 🏝️ – 50 balls
5) B McCullum 🇳🇿 – 51 balls
Today, Finn Allen has smashed the Fastest ever T20 WC 💯 #NZvsSA pic.twitter.com/ti4BEyycJv
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 4, 2026
పవర్ ప్లేలో కరిగిన లక్ష్యం
ఈడెన్ గార్డెన్స్‌లో భారీ ఛేదనలో న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్(100 నాటౌట్), టిమ్ సీఫర్ట్(41 నాటౌట్)లు బెరుకు లేకుండా ఆడారు. తొలి ఓవర్లోనే సీఫర్ట్ రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ.. రబడ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన అతడికి క్వింటన్ డికాక్ లైఫ్ ఇచ్చాడు. బ్రెవిస్‌ను కాదని క్యాచ్ అందుకునేందుకు పరుగెత్తిన డికాక్.. చివరకు అడుగు దూరంలో ఆగిపోయాడు. అంతే.. అక్కడి నుంచి ప్రత్యర్థి బౌలర్లకు.. ఫీల్డర్లకు ఏ మాత్రం అవకాశమివ్వలేదీ జోడీ. మూడో ఓవర్ నుంచి కివీస్ ఓపెనర్ల విధ్వంసం తారా స్థాయికి చేరింది.
28-ball fifty for Tim Seifert ✅
19-ball fifty for Finn Allen ✅New Zealand are cruising towards the final! pic.twitter.com/TAaRQvP4uL
— ESPNcricinfo (@ESPNcricinfo) March 4, 2026
యాన్సెన్‌కు గుబులు పుట్టిస్తూ ఇద్దరూ .. మూడో మూడో 18 రన్స్ పిండుకున్నారు. కార్బిన్ బాష్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో అలెన్ బౌండరీల మోతమోగించాడు. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్ని బౌండరీలకు తరలించి స్కోర్ 80 దాటించాడు. అంతే.. చూస్తుండగానే సగానికి పైగా లక్ష్యం కరిగిపోయింది. అర్ధ శతకాలతో తొలి వికెట్‌కు 117 పరుగులు రాబట్టిన ఈ ద్వయాన్ని విడదీసిన రబడ సఫారీలను ఊపిరి తీసుకోనిచ్చాడు. కానీ, రచిన్ రవీంద్ర() జతగా అలెన్ అదే దూకుడు కొనసాగించాడ. యాన్సెన్‌ను టార్గెట్ చేసిన అతడు.. 13వ ఓవర్లో 4, 4, 6, 6, 4తో జోరుతో మ్యాచ్‌ను ముగించాడు.
యాన్సెన్ సిక్సర్ల హోరు..
అజేయంగా సెమీస్‌కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో తడబడినా.. మార్కో యాన్సెన్(55 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. కొలే మెక్కొన్చీ(2-9) విజృంభణతో టాపార్డర్.. మిడిలార్డర్ కుప్పకూలిన చోట.. ఈ బక్కపలచని ఆల్‌రౌండర్ దంచేశాడు. డెవాల్డ్ బ్రెవిస్(34) ఔటయ్యాక ట్రిస్టన్ స్టబ్స్(29) జతగా అటాకింగ్ గేమ్‌తో న్యూజిలాండ్ బౌలర్ల లయను దెబ్బతీసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. సఫారీలను పోటీలోకి తీసుకొచ్చిన యాన్సెన్.. ఆఖరి ఓవర్లో మరింత చెలరేగాలనుకున్నా మ్యాట్ హెన్రీ(2-34) ఆ అవకాశమివ్వలేదు. అతడు వరుసగా రెండు వికెట్లు తీయడంతో ప్రొటీస్ జట్టు 169 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

