Benjamin Netanyahu | దేశం విడిచి వెళ్లిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తాజా ప్రచారంలో నిజమెంత..?
Benjamin Netanyahu : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు జర్మనీ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి.
Benjamin Netanyahu : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు జర్మనీ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి. దీనికో కారణం ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన హైసెక్యూరిటీ విమానం ‘వింగ్ ఆఫ్ జియోన్’ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో కనిపించింది.
అక్కడి బ్రాండన్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో ‘వింగ్ ఆఫ్ జియోన్’ అనే విమానం ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ విమానంలో నెతన్యాహు జర్మనీ రాజధాని బెర్లిన్ వెళ్లారని ప్రచారం మొదలైంది. సాధారణంగా ఒక దేశానికి చెందిన ప్రధాని, రాష్ట్రపతి వంటి అగ్రనేతలు ఇలాంటి విమానంలోనే ప్రయాణిస్తారు. అందువల్ల నెతన్యాహు కూడా ఆ విమానంలో అక్కడికి చేరుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్ దాడులకు భయపడి నెతన్యాహు దేశం విడిచి వెళ్లిపోయారని పాలస్తీనా అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. నెతన్యాహు టెల్ అవీవ్‌లోని కార్యాలయంలోనే ఉన్నారని వెల్లడించింది.
అక్కడి రక్షణ అధికారులతో ఒక హై సెక్యూరిటీ మీటింగ్‌లో నెతన్యాహు పాల్గొన్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. అలాగే ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలిస్తున్న కొన్ని వీడియోల్ని కూడా పంచుకుంది. దీంతో నెతన్యాహు ఇంకా ఇజ్రాయెల్‌లోనే ఉన్నారని స్పష్టమైంది. ఆయన జర్మనీ వెళ్లారనే ప్రచారంలో నిజం లేదని తేలింది. కాగా.. కొన్ని భద్రతా కారణాలరీత్యా అధికారిక విమానం బెర్లిన్ వెళ్లినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

