Vijay Rupani : అహ్మదాబాద్ (Ahmedabad) లో మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ రక్తసంబంధీకుల డీఎన్ఏ (DNA) తో ఘటనా స్థలంలో సేకరించిన శరీర భాగాల డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 11.10 గంటలకు డీఎన్ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి.
రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజ్‌కోట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గత గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం కొన్ని సెకన్లలోనే కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విజయ్ రూపానీతోపాటు ఆ విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేశ్ విశ్వాస్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డారు. అదేవిధంగా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అందులోని పలువురు వైద్యులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో కూడా పరిస్థితి విషమించి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో బీజే హాస్టల్ మృతుల సంఖ్య 38కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.