Fighter jet : బ్రిటన్ నేవీ (UK Navy) కి చెందిన ఓ యుద్ధ విమానం (Fighter Jet) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత్ మీదుగా వెళ్తున్న F-35 యుద్ధ విమానాన్ని పైలట్ అత్యవసరంగా తిరువనంతపురం (Thiruvananthapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఏటీసీ అధికారుల అనుమతితో ఎయిర్‌పోర్టులో విమానాన్ని దించాడు.
విమానంలో ఇంధనం ఖాలీ కావడంవల్లే తిరువనంతపురం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆ యుద్ధ విమానం ఇంకా ఎయిర్‌పోర్టులోనే ఉన్నది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.