NZ vs SA | పవర్ ప్లేలో దంచేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు.. డికాక్ పొరపాటుకు భారీ మూల్యం..!
NZ vs SA : తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. రబడ ఓవర్లో క్వింటన్ డికాక్ క్యాచ్ పొరపాటుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లంచుకుంది.
NZ vs SA : తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. రబడ ఓవర్లో క్వింటన్ డికాక్ క్యాచ్ పొరపాటుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లంచుకుంది. టిమ్ సీఫర్ట్(41 నాటౌట్), ఫిన్ అలెన్(43 నాటౌట్)ల ధాటికి పవర్ ప్లేలోనే 84 రన్స్ వచ్చాయి. ఆరు ఓవర్లకే లక్ష్యంలో సగం పరుగులను కివీస్ కొట్టేసింది. వీళ్లిద్దరు ఇదే తీరుగా ఉతికేస్తే.. సఫారీల ట్రోఫీ కల కల్లలైనట్టే.. పొట్టి వరల్డ్‌కప్ చరిత్రలో ఒక్కసారి కూడా ప్రొటీస్ జట్టును ఓడించని బ్లాక్ క్యాప్స్ కొత్త చరిత్ర లిఖించినట్టే.
ఈడెన్ గార్డెన్స్‌లో భారీ ఛేదనలో న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(41 నాటౌట్), ఫిన్ అలెన్(43 నాటౌట్)లు బెరుకు లేకుండా ఆడేస్తున్నారు. తొలి ఓవర్లోనే సీఫర్ట్ రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ.. రబడ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన అతడికి క్వింటన్ డికాక్ లైఫ్ ఇచ్చాడు. బ్రెవిస్‌ను కాదని క్యాచ్ అందుకునేందుకు పరుగెత్తిన డికాక్.. చివరకు అడుగు దూరంలో ఆగిపోయాడు.
New Zealand’s 84/0 is the highest powerplay total in a men’s #T20WorldCup knockout match, passing England’s 67/0 against New Zealand in the 2016 semi-final https://t.co/Ppz9rsZJsB
— ESPNcricinfo (@ESPNcricinfo) March 4, 2026
అంతే.. అక్కడి నుంచి ప్రత్యర్థి బౌలర్లకు.. ఫీల్డర్లకు ఏ మాత్రం అవకాశమివ్వలేదీ జోడీ. మూడో ఓవర్ నుంచి కివీస్ ఓపెనర్ల విధ్వంసం తారా స్థాయికి చేరింది. యాన్సెన్‌కు గుబులు పుట్టిస్తూ ఇద్దరూ .. మూడో మూడో 18 రన్స్ పిండుకున్నారు. కార్బిన్ బాష్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో అలెన్ బౌండరీల మోతమోగించాడు. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆ తర్వాతి నాలుగు బంతుల్ని బౌండరీలకు తరలించి స్కోర్ 80 దాటించాడు. అంతే.. చూస్తుండగానే సగానికి పైగా లక్ష్యం కరిగిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

