Velugumatla | బుక్కెడు బువ్వ తిననియ్యరా.. వెలుగుమట్ల బాధితులపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం
Velugumatla | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంతో గూడు చెదిరిన ‘వెలుగుమట్ల’ పేదలు.. కనీసం బుక్కెడు బువ్వకూ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది.
Velugumatla | రఘునాథపాలెం, మార్చి 10 : కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంతో గూడు చెదిరిన ‘వెలుగుమట్ల’ పేదలు.. కనీసం బుక్కెడు బువ్వకూ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. కొండలు, గుట్టలను తొలచి కష్టాలకోర్చి కట్టుకున్న ఇండ్ల నుంచి కూల్చి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు పంపిన ప్రభుత్వం.. అక్కడా సౌకర్యాలు కల్పించకుండా కక్ష గట్టింది. ఎలాగైనా వారిని వెళ్లగొట్టాలని కుట్ర పన్ని భోజనం అందకుండా చేయాలని ప్లాన్ చేసింది. ఇటీవల ఖమ్మం పర్యటనకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గమనించి.. భోజనం ఏర్పాట్లు చేయాలని సూచించడంతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూదాన్ బాధితులకు రెండు పూటలా భోజనం అందిస్తున్నారు.
అయితే ఎప్పటిలా పేదలకు భోజనం తీసుకొచ్చిన పువ్వాడ ఫౌండేషన్ వాహనాలను మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం అంబేద్కర్ భవన్ సమీపంలో ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలు లోపలికి వెళ్లొద్దని, బాధితులకు అన్నదానం చేయొద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు నచ్చచెప్పినా వినలేదు. ఇంతలో పేదలు కూడా వచ్చి తమ నోటికాడి బుక్కను అందకుండా చేయొద్దని, తమను వెళ్లగొట్టే ప్రయత్నం చేయొద్దని పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డ్డారు. అయినా పోలీసులు కనికరించకపోవడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై అన్నదానం ప్రారంభించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులు అక్కడికే వచ్చి భోజనం చేశారు. పరిస్థితి జటిలమవుతుండడాన్ని గమనించి పోలీసులు కొద్దిసేపటి తర్వాత వాహనాలను అంబేద్కర్ భవన్లోకి అనుమతించారు.
మంగళవారం వెలుగుమట్ల నిర్వాసితులకు భోజనం అందజేస్తున్న పువ్వాడ ఫౌండేషన్

అవి భూదాన్ భూములు! వారు నాదాన్ మనుషులు! అందుకే సర్కార్ బుల్డోజర్లను తోలింది. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చింది. 766 కుటుంబాలను రోడ్డున పడేసింది. పైగా గూడు చెదిరిన పేదలను పెయిడ్ అర్టిస్టులంటూ ప్రభుత్వ పెద్దలే విషం వెళ్లగక్కారు.నోరులేనివాళ్లు మౌనంగా వెళ్లిపోతారని భావించిన ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది.ఆహారం, సహాయం అందించింది. పోరాటానికీ సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ దిగిరాక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో తప్పు ఒప్పుకుని.. బాధితులకు అక్కడే పట్టాలిచ్చి, ఇండ్లు కట్టిస్తానని ప్రకటించింది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

