Jharkhand: అసెంబ్లీ దిశగా జార్ఖండ్ విద్యార్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనాన్ల ప్రయోగం
Jharkhand: రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఇవాళ జార్ఖండ్ విద్యార్థులు ఛలో అసెంబ్లీ చేపట్టారు. ఆ స్టూడెంట్స్పై లాఠీఛార్జ్ చేశారు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు. స్టూడెంట్ లీడర్ దేవేంద్ర నాథ్ .. అంబులెన్సులోనే ఛలో అసెంబ్లీ నిర్వహిస్తున్నాడు.
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ జార్ఖండ్(Jharkhand) విద్యార్థులు ఇవాళ రాంచీలోని అసెంబ్లీ వైపు ర్యాలీ చేపట్టారు. వేల సంఖ్యలో విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మూడో దఫా చర్చలు విఫలం కావడంతో.. సోమవారం అసెంబ్లీ దిశగా విద్యార్థులు ర్యాలీ తీశారు. 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్సులో అసెంబ్లీ మార్చ్ చేపట్టారు. జార్ఖండ్ విద్యార్థులు కీలకంగా రెండు డిమాండ్లు చేస్తున్నారు. జెఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యువేట్ లెవల్ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతకవలపై సీబీఐ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే 14వ జేపీఎస్సీ నియామక పరీక్షను రద్దు చేస్తామని ప్రభుత్వం ఆదివారం హామీ ఇచ్చినా.. విద్యార్థులు మాత్రం ఇవాళ ఆందోళన విరమించలేదు.
జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఉదయం భారీ సంఖ్యలో విద్యార్థులు గుమ్మికూడారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా తొలుతు పోలీసు బారికేడ్లను తొలగించారు. రాంచీ ధర్నా కేంద్రానికి చేరడానికి ముందు పోలీసులు అనేక సార్లు అడ్డుకున్నట్లు విద్యార్థులు చెప్పారు. ఛలో అసెంబ్లీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ బారికేడ్లు పెట్టినా, తన ఆరోగ్యం సహకరించకున్నా, తాము ర్యాలీ ఆపలేదన్నారు. ఇదేమైనా పాకిస్థానా, బంగ్లాదేశా, చైనా సరిహద్దా అని ప్రశ్నించారు. విద్యార్థులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వైపు దూసుకువస్తున్న విద్యార్థులపై వాటన్ కెనాన్లతో దాడి చేశారు. భారీ సంఖ్యలో వస్తున్న విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసులు ఓ దశలో లాఠీఛార్జ్ చేశారు.
#WATCH | JPSC-JSSC aspirants’ protest in Ranchi (Jharkhand) | Police resort to lathi charge to control the crowd, during ‘Vidhan Sabha gherao’ march of protesting students. pic.twitter.com/f4XGdOajrh
— ANI (@ANI) August 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

