తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రానికి చెందిన బండారి తిరుపతి( Bandari Tirupati ) న్యూరోసర్జరీ ఎగ్జిట్ పరీక్షలో (Neurosurgery Exit Exam) విశిష్ట ప్రతిభ కనబరిచారు.శుక్రవారం వచ్చిన నీట్ పలితాల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు.
ప్రస్తుతం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్ గా పనిచేస్తూ అడ్వాన్స్డ్ బ్రెయిన్, స్పైన్ సర్జరీల్లో నిపుణుడిగా సేవలందిస్తూనే న్యూరోసర్జరీ ఎగ్జిట్ పరీక్షలు రాసి ర్యాంక్‌ను సాధించడం పట్ల మండల అధికారులు, నాయకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువత అభినందనలు తెరిపారు.
బండారి తిరుపతి ప్రాథమిక విద్యను తాండూర్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు , శ్రీ విష్ణు శివ నికేతన్ హైస్కూల్ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం బెల్లంపల్లి లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 2009లో నిర్వహించిన ఈఎంసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 72వ ర్యాంక్ సాధించడంతో పాటు భౌతిక శాస్త్రంలో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు.
ఆ తరువాత కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం నీట్ పీజీ పరీక్షలో ఎంఎస్ జనరల్ సర్జరీ సీటు సాధించి అదే కళాశాలలో పీజీ పూర్తి చేశారు. సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమై నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో అల్ ఇండియా స్థాయిలో 68వ ర్యాంక్ సాధించి హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ లో డీఎన్ బీ న్యూరోసర్జరీ రెసిడెన్సీలో చేరారు.