Microwave | మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వండేటప్పుడు మూత పెట్టాలా.. వద్దా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
నేటి తరుణంలో మైక్రోవేవ్ వాడడం అనేది ఒక సాధారణ విషయమైనది అని చెప్పవచ్చు. చాలా సులభంగా మైక్రోవేవ్ లో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఆహారాన్ని లోపల పెట్టి చిన్న బటన్ నొక్కితే చాలు సరిపోతుంది అని అనుకుంటారు. కానీ చాలా మందికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటూనే ఉంటుంది అని చెప్పవచ్చు.
Microwave | నేటి తరుణంలో మైక్రోవేవ్ వాడడం అనేది ఒక సాధారణ విషయమైనది అని చెప్పవచ్చు. చాలా సులభంగా మైక్రోవేవ్ లో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఆహారాన్ని లోపల పెట్టి చిన్న బటన్ నొక్కితే చాలు సరిపోతుంది అని అనుకుంటారు. కానీ చాలా మందికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటూనే ఉంటుంది అని చెప్పవచ్చు. మైక్రోవేవ్ లో వండేటప్పుడు మూత పెట్టాలా.. వద్దా.. అనే సందేహం వస్తూనే ఉంటుంది. ఇది చిన్న విషయంగానే అనిపించినా పోషకాలు, భద్రత, ఆహారం గుణం పరంగా ఇది ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోవేవ్ లో ఆహారం వండే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులోని నీటి అణువులు వేగంగా కంపించేటట్లు మైక్రోవేవ్ తరంగాలు పని చేస్తాయి. ఆ కంపన వల్ల వేడి ఉత్పత్తి అయ్యి ఆహారాన్ని లోపల నుండి ఉడికిస్తుంది. మైక్రోవేవ్ లో ఆహారం లోపల నుంచే వేడి పుడుతుంది. అందుకే మైక్రోవేవ్ లో ఆహారంలో ఉండే తేమ చాలా ముఖ్యమైనది.
మూత పెట్టి వండితే..
మైక్రోవేవ్ లో మూత పెట్టి వండితే ఆవిరి లోపలే ఉంటుంది. దీంతో ఆహారం సమానంగా వేడి అవుతుంది. తేమ తగ్గిపోదు. వంట సమయం కూడా తగ్గుతుంది. తక్కువ సమయం ఉడకడం వల్ల విటమిన్ సి, ఫోలేట్ వంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిల్వ ఉంటాయి. ఇక మూత లేకుండా వండితే ఆవిరి బయటకు పోతుంది. ఆహారం పైభాగం త్వరగా ఎండిపోతుంది. కొన్ని చోట్ల అధికంగా వేడి పుడుతుంది. ఇలా వండితే పోషకాల నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మైక్రోవేవ్ లో వండేటప్పుడు కొన్ని చోట్ల వేడి అధికంగా ఉంటుంది. కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. మైక్రోవేవ్ లో వండడంలో వచ్చిన పెద్ద సమస్య ఇదే అని చెప్పవచ్చు. ఇలా ఉడకడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు. మూత పెట్టి వడడం వల్ల ఆవిరి కారణంగా వేడి సమానంగా ఉంటుంది. కనుక ఆహారం సురక్షితంగా వండే అవకాశాలు పెరుగుతాయి.
ఇలా చేయాలి..
అలాగే మూత పెట్టి వండడం వల్ల కూరగాయల రంగు మెరుగ్గా ఉంటుంది. వాటి సహజమైన రంగు, నిగారింపు, రుచి నిల్వ ఉంటాయి. మూత లేకుండా వండడం వల్ల కూరగాయలు ఎండిపోవడంతో పాటు గట్టిగా అవుతాయి. అయితే కొందరు మాత్రం ఎల్లపుడూ మూత పెట్టకుండానే వండుతూ ఉంటారు. ప్రెషర్ కారణంగా మైక్రోవేవ్ పేలిపోతుందేమో అని భయపడతారు. అయితే వెంటిలేషన్ ఉన్న మూత పెట్టడం లేదా ఆహారాన్ని వదులుగా కప్పి ఉడికిస్తే సరిపోతుందని గట్టిగా మూత పెట్టి ఉడికించకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారంపై ప్లాస్టిక్ కు బదులుగా గాజు, సిరామిక్, మైక్రోవేవ్ సేప్ కవర్లు ఉంచి ఉడికించడం మంచిది. మైక్రోవేవ్ లో వండే ఆహారాలపై వదులుగా కప్పి లేదా వెంటిలేషన్ ఉన్న మూతలు ఉంచి ఉడికించడం మంచిదని, దీని వల్ల ఆహారంలో ఉండే పోషకాలు ఎక్కువగా పోకుండా ఉంటాయని , ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Microwave
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

