man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Uttarakhand man builds flying car | ఒక యువకుడు ఎలాంటి ఇంజినీరింగ్ డిగ్రీ చదువలేదు. అయితే ఎగిరే కారు తయారు చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. దీని కోసం 13 ఏళ్లుగా ఇంటర్నెట్లో నేర్చుకున్నాడు. చివరకు ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ నమూనాను నిర్మించాడు. దానిని స్వయంగా నడిపి తన ప్రతిభను చాటుకున్నాడు.
డెహ్రాడూన్: ఒక యువకుడు ఎలాంటి ఇంజినీరింగ్ డిగ్రీ చదువలేదు. అయితే ఎగిరే కారు తయారు చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. దీని కోసం 13 ఏళ్లుగా ఇంటర్నెట్లో నేర్చుకున్నాడు. చివరకు ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ నమూనాను నిర్మించాడు. దానిని స్వయంగా నడిపి తన ప్రతిభను చాటుకున్నాడు. (Uttarakhand man builds flying car) ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కాఫ్లిఖాన్కు చెందిన రవి తమ్తా, గ్రామంలోని జూనియర్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఆ తర్వాత నైనిటాల్ క్యాంపస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. తండ్రి హరీష్ రామ్ ఒక మెకానిక్.
కాగా, గ్రామీణ ప్రాంతంలో పెరిగిన రవిని, కొండల గుండా ప్రయాణించడంలో ఎదురయ్యే సవాళ్లు, ముఖ్యంగా ఆసుపత్రికి చేరుకోవడానికి కొండ రహదారులపై సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి రావడం వంటివి చిన్నప్పటి నుంచి తీవ్రంగా ఆలోచింపజేశాయి. దీంతో 2015లో ఎగిరే కారును నిర్మించాలని కలలు కనడం ప్రారంభించాడు. అయితే ఇంజినీరింగ్ చదవకపోయినప్పటికీ 13 ఏళ్లుగా ఆన్లైన్లో దీని గురించి అభ్యసించాడు. ప్రయోగాల కోసం సొంతంగా హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్‌ను అభివృద్ధి చేశాడు.
మరోవైపు సింగిల్ సీటర్ ఎరిగే కారు అయిన హపిడా స్కైనెక్స్ను ఎట్టకేలకు రవి తయారు చేశాడు. మల్టీరోటర్ డ్రోన్ సాంకేతికను వినియోగించాడు. ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లు, తేలికపాటి ఫ్రేమ్, చిన్న కాక్‌పిట్‌తో ఎగిరే కారును రూపొందించాడు. ఇది బ్యాటరీతో నడుస్తుంది. రన్‌వే లేకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అవుతుంది.
ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ ఎగిరే కారు తొలి ప్రయోగాత్మక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కొండ ప్రాంతాల్లో తక్కువ దూరం ప్రయాణించడం, మారుమూల ప్రాంతాలలో వైద్య, అత్యవసర పరిస్థితులకు వినియోగించే లక్ష్యంగా రవి దీనిని తయారు చేశాడు. అయితే పూర్తి వినియోగం కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతితో పాటు మరిన్ని ట్రయల్స్, నియంత్రణ ఆమోదాలు అవసరమున్నది.
కాగా, ఆన్లైన్లో స్వీయ అభ్యాసం ద్వారా అధికారిక కోర్సులకు మించిన ఆలోచనలను కార్యరూపం దాల్చవచ్చని ఎగిరే కారు తయారీ ద్వారా రవి నిరూపించాడు. దీనికి ముందు కూడా పలు ఆవిషర్కణలు చేశాడు. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసే బూట్లు, దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక స్మార్ట్ వాకింగ్ స్టిక్, వెదురును చీల్చే యంత్రం, అగ్నిమాపక పరికరాలు, అటవీ శాఖ కోసం ఒక స్టిక్ మొబైల్ ఛార్జర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటివి అతడు అభివృద్ధి చేశాడు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు పలువురు రవి చేసిన ఆవిష్కరణలను అభినందించారు.
उत्तराखंड के अल्मोड़ा के युवा इनोवेटर रवि टम्टा जी को ड्रोन तकनीक में नवाचार करते हुए HAPIDA SKYNEX प्रोटोटाइप के सफल उड़ान परीक्षण पर हार्दिक बधाई।
आपकी यह उपलब्धि सिद्ध करती है कि हमारे युवाओं में प्रतिभा, नवाचार और वैज्ञानिक सोच की कोई कमी नहीं है। आपका यह अभिनव प्रयास उत्तराखंड ही नहीं बल्कि पूरे देश के युवाओं के लिए प्रेरणास्रोत है। विश्वास है कि आप भविष्य में भी अपने नवाचारों से विज्ञान एवं प्रौद्योगिकी के क्षेत्र में नई ऊंचाइयों को छुएँगे।
आपके उज्ज्वल भविष्य एवं निरंतर सफलता के लिए हार्दिक शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

