పంజాబ్ 289/6.. రక్షణకు రెండు వికెట్లు హైదరాబాద్‌తో రంజీ పోరు
రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తొలి రోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గ్రూప్-బిలో భాగంగా జింఖానా మైదానంలో పంజాబ్తొ సోమవారం మొదలైన మ్యాచ్‌లో మొదటి రెండు సెషన్లలో ఐదు వికెట్లు పడగొట్టినా.. అదే జోరును కొనసాగించలేకపోయారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తొలి రోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గ్రూప్-బిలో భాగంగా జింఖానా మైదానంలో పంజాబ్తొ సోమవారం మొదలైన మ్యాచ్‌లో మొదటి రెండు సెషన్లలో ఐదు వికెట్లు పడగొట్టినా.. అదే జోరును కొనసాగించలేకపోయారు. దాంతో పంజాబ్ 90 ఓవర్లలో 289/6తో తొలి రోజు ఆట ముగించింది. ఐపీఎల్ స్టార్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (81), సలీల్ అరోరా (57 బ్యాటింగ్), రమణ్‌దీప్ (52) అర్ధ శతకాలతో సత్తా చాటారు. ప్రస్తుతం అరోరా, ఈమన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పేసర్ రక్షణ్ రెడ్డి (2/53) రెండు వికెట్లతో రాణించాడు.
టాస్ నెగ్గి పంజాబ్ బ్యాటింగ్‌కు దిగగా ఆరో ఓవర్లోనే ఓపెనర్ విహాన్ మల్హోత్రా (12)ను ఔట్ చేసిన రక్షణ్ షాకిచ్చాడు. తర్వాత హర్నూర్ సింగ్ (17)ను స్పిన్నర్ తనయ్ కీపర్ క్యాచ్‌తో వెనక్కుపంపాడు. కెప్టెన్ ఉదయ్ శరణ్ (16)ను మరో స్పిన్నర్ అనికేత్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ 105/3తో నిలిచింది. కానీ, ప్రభ్‌సిమ్రన్ అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పుల్ షాట్లు, కవర్ డ్రైవ్స్‌తో బౌండరీలు రాబట్టాడు.

అయితే శతకం దిశగా సాగుతున్న అతడిని 45వ ఓవర్లో రక్షణ్ బౌల్డ్ చేయగా.. జషన్‌ప్రీత్ (45) రనౌట్ కావడంతో పంజాబ్ ఓ దశలో 182/5తో డీలా పడింది. కానీ, సలీల్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో తన్మయ్ డ్రాప్ చేయడం హైదరాబాద్‌ను దెబ్బతీసింది. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న అతను రమణ్‌దీప్‌తో ఆరో వికెట్‌కు కీలకమైన 93 పరుగులు జోడించాడు. ఆట ముగిసే ముందు రమణ్దీప్ను హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ బౌల్డ్ చేసినా… తొలి రోజు పంజాబ్‌దే పైచేయి అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

