Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Leopard try to attack sleeping workers | వ్యవసాయ పనులు చేసి అలిసిపోయిన కూలీలు పొలంలో నిద్రించారు. రాత్రి వేళ ఒక పులి వారిని సమీపించింది. ఆ కూలీలపై దాడికి అది ప్రయత్నించింది. అయితే కారులో వెళ్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించాడు.
ముంబై: వ్యవసాయ పనులు చేసి అలిసిపోయిన కూలీలు పొలంలో నిద్రించారు. రాత్రి వేళ ఒక పులి వారిని సమీపించింది. ఆ కూలీలపై దాడికి అది ప్రయత్నించింది. అయితే కారులో వెళ్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించాడు. హారన్ మోగించడంతో పాటు తన వాహనంతో ఆ చిరుతను తరిమిగొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Leopard try to attack sleeping workers) మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాలో ప్రస్తుతం వరి కోత, పంట నూర్పిళ్ల సీజన్ మొదలైంది. పంజాబ్‌కు చెందిన కొందరు కూలీలు యంత్రాలతో అక్కడకు చేరుకుని వ్యవసాయ పనులు చేస్తున్నారు. నవేగావ్బంద్ నేషనల్ పార్క్ ప్రాంతంలోని అటవీ శాఖ కాలనీ సమీపంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని వారు ఉంటున్నారు.
కాగా, రోజంతా వ్యవసాయ పనులు చేసిన కొందరు కూలీలు రాత్రి భోజనం తర్వాత పొలంలో నిద్రించారు. ఒక చిరుత అక్కడకు చేరుకున్నది. ఆరుబయట నిద్రిస్తున్న కూలీలను అది గమనించింది. మెల్లగా వారిని సమీపించసాగింది.
అయితే మనీష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న కూలీలపై దాడి కోసం చిరుత వారిని సమీపించడాన్ని అతడు గమనించాడు. అప్రమత్తమైన మనీష్, కారు హారన్‌ను పదేపదే మోగించాడు. అలాగే తన వాహనంతో ఆ చిరుతను వెంబడించాడు. కారు దగ్గరగా రావడంతో భయపడిన ఆ చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో అలిసి గాఢ నిద్రలో ఉన్న ఆ కూలీలకు పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు చిరుత సంచారం నేపథ్యంలో వలస కార్మికులు రాత్రి వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరు బయట నిద్రించవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. అయితే కారులోని వ్యక్తులు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- charging
- leopard
- Maharashtra
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

