Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
Amur Falcons | కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రెండు అమూర్ ఫాల్కన్ బర్డ్స్ (Amur Falcon Birds) సురక్షితంగా మణిపూర్ (Manipur) కు తిరిగొచ్చాయి. 'అపపాంగ్ (Apapang)', 'అలాంగ్ (Alang)' అని పేరుపెట్టిన ఈ పక్షులు తమ వార్షిక వలస ప్రయాణంలో భాగంగా ఆసియా (Asia), ఆఫ్రికా (Africa) ఖండాల్లోని 23 దేశాలను చుట్టి వచ్చాయని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) శనివారం ప్రకటించారు.
Amur Falcons : కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత రెండు అమూర్ ఫాల్కన్ బర్డ్స్ (Amur Falcon Birds) సురక్షితంగా మణిపూర్ (Manipur) కు తిరిగొచ్చాయి. ‘అపపాంగ్ (Apapang)’, ‘అలాంగ్ (Alang)’ అని పేరుపెట్టిన ఈ పక్షులు తమ వార్షిక వలస ప్రయాణంలో భాగంగా ఆసియా (Asia), ఆఫ్రికా (Africa) ఖండాల్లోని 23 దేశాలను చుట్టి వచ్చాయని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) శనివారం ప్రకటించారు. ఈశాన్య చైనా (Northeast China) లోని తమ సంతానోత్పత్తి కేంద్రాల నుంచి బయలుదేరిన 11 రోజుల తర్వాత ఇవి మణిపూర్‌లో వాలాయి.
2025 నవంబర్‌లో ‘వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ శాస్త్రవేత్తలు ఈ రెండు పక్షులకు శాటిలైట్ ట్యాగ్లు అమర్చి విడిచిపెట్టారు. అప్పటి నుంచి వాటి ప్రయాణ మార్గాన్ని నిరంతరం గమనించారు. సరిగ్గా ఏడాది తర్వాత అవి మళ్లీ మణిపూర్‌కు తిరిగి రావడంతో ఈ ట్రాకింగ్ సైకిల్ విజయవంతంగా పూర్తయింది. ఫాల్కన్ పక్షుల తిరిగిరాకతో పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ పక్షులు మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లా పర్వత ప్రాంతాల్లో రెండు నుంచి మూడు వారాలపాటు ఉంటాయి.
ఈ సమయంలో ఇక్కడి చెద పురుగులను ఆహారంగా తీసుకుని, తమ తదుపరి సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన శక్తి కోసం శరీరంలో కొవ్వును నిల్వ చేసుకుంటాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ వలస ప్రయాణంలో అత్యంత కఠినమైన దశను ప్రారంభిస్తాయి. తదుపరి మజిలీగా ఇవి సోమాలియాకు బయలుదేరతాయి. అందుకోసం దాదాపు 6,000 కిలోమీటర్ల దూరం ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణంలో అరేబియా సముద్రంపై సుమారు 3,000 కిలోమీటర్ల దూరం అవిశ్రాంతంగా ఎగరాల్సి ఉంటుంది.
అమూర్ ఫాల్కన్లు ఈశాన్య ఆసియాలో సంతానోత్పత్తి చేసి శీతాకాలంలో ఆఫ్రికాకు వలస వెళతాయి. ఈ క్రమంలో ఈశాన్య భారతదేశం వాటికి కీలకమైన విశ్రాంతి కేంద్రంగా ఉన్నది. ఏటా తమ ప్రాంతానికి వచ్చే ఈ అతిథులను స్థానిక సమాజాలు ఎంతో ప్రేమగా చూసుకుంటూ, వాటి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కాగా, ఈ శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా వాటి ప్రయాణ మార్గాలు, అద్భుతమైన సహనశక్తిపై శాస్త్రవేత్తలకు విలువైన సమాచారం అందుతున్నది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

