Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Bus Plunges Into Gorge | ఒక బస్సు నియంత్రణ కోల్పోయింది. లోయలోకి అది దూసుకెళ్లింది. అయితే ఒక చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు జంప్ చేసి దాని నుంచి బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డెహ్రాడూన్: ఒక బస్సు నియంత్రణ కోల్పోయింది. లోయలోకి అది దూసుకెళ్లింది. అయితే ఒక చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు జంప్ చేసి దాని నుంచి బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bus Plunges Into Gorge) ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 21న గర్వాల్ మోటార్ ఓనర్స్ యూనియన్‌కు చెందిన బస్సు, కోట్ద్వార్ నుంచి పౌరీ-శ్రీనగర్‌కు వెళ్తున్నది. అయితే గుమ్ఖాల్, భదలిఖాల్ మధ్యలో ఆ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రెజర్ పైపు అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో బస్సు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
కాగా, రోడ్డు వెనుక వైపు వాలుగా ఉండటంతో ఆ బస్సు అదుపు తప్పింది. రోడ్డుకు ఎడమ వైపున ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఒక చెట్టును బలంగా ఢీకొట్టడంతో అది ఆగిపోయింది. ఒక నిర్మాణంపై ఒరిగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బోల్తా పడిన ఆ బస్సు లోయలోకి ప్రమాదకరంగా వేలాడింది. అందులోని ప్రయాణికులు సాహసం చేశారు. ఆ బస్సు నుంచి దూకి బయటపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే దుగడ్డా, గుమ్ఖాల్ అవుట్‌పోస్టులకు చెందిన పోలీస్, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహయక చర్యలు చేపట్టారు. ఆ బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే లోయలో బోల్తా పడి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆ బస్సు నుంచి ప్రయాణికులు కిందకు దూకి బయటపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨SHOCKING | Bus fell into a gorge in Uttarakhand, but all passengers survived as the bus did not overturn completely https://t.co/J8LuRfjCWO
— The Tatva (@thetatvaindia) October 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- Gorge
- jumping
- Passengers
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

