Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Newlywed Collapses In Hotel Room | కొత్తగా పెళ్లైన మహిళ, తన భర్తతో కలిసి హోటల్లో బస చేసింది. అయితే ఆ హోటల్ రూమ్ వద్ద ఆమె కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా నవ వధువు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కుమార్తెను భర్త హత్య చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
లక్నో: కొత్తగా పెళ్లైన మహిళ, తన భర్తతో కలిసి హోటల్లో బస చేసింది. అయితే ఆ హోటల్ రూమ్ వద్ద ఆమె కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా నవ వధువు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కుమార్తెను భర్త హత్య చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. (Newlywed Collapses In Hotel Room) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన 28 ఏళ్ల ముస్కాన్‌కు, మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందిన నీలేశ్‌తో ఈ ఏడాది జూన్ 29న వివాహమైంది. అక్టోబర్ 23న రాత్రి వేళ నీలేష్, ఝాన్సీకి వచ్చాడు. మరునాడు భార్య ముస్కాన్‌ను తన బంధువు ఇంటికి తీసుకెళ్తున్నట్లు అత్తమామలకు చెప్పాడు. అయితే ఝాన్సీలోని రిషబ్ హోటల్లో భార్యాభర్తలు బస చేశారు.
కాగా, అక్టోబర్ 25న ఉదయం 10:50 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు హోటల్ కారిడార్ గుండా ఒక గది వైపు నడుస్తూ కనిపించారు. ఒక వ్యక్తి, నీలేష్ ముందుగా లోపలకు వెళ్లారు. భర్త వెనుక నడుస్తూ వచ్చిన ముస్కాన్ అకస్మాత్తుగా రూమ్ బయట కుప్పకూలింది. నీలేష్ వచ్చి ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ముస్కాన్‌ను ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ముస్కాన్ మరణించినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. భర్త నీలేష్ తమ కుమార్తెను హత్య చేసినట్లు ఆమె తండ్రి ఆరోపించారు. నీలేష్‌కు ఇది వరకే మరో వివాహం జరిగిందని, ఆ విషయాన్ని తమకు చెప్పకుండా దాచిపెట్టినట్లు ముస్కాన్ తమతో చెప్పిందన్నారు. ఇండోర్‌లో ఉంటున్న ఆ మహిళతో ముస్కాన్‌ను నీలేష్ తరచుగా పోల్చి ఆమెను మెచ్చుకునేవాడని తమ కుమార్తె ఆరోపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ముస్కాన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త నీలేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె తండ్రి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే హోటల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
She was Muskan Somalia.
She got married 4 months ago.
Today in Jhansi UP, she, along with her husband and a hotel employee, enters a room and just within 5 seconds she fell down onto the floor. Her family rushed her to a nearby hospital but unfortunately she died.
What could be the reason??
— Simpu Singh (@Simpu_SinghIND) October 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CCTV
- Collapses
- Dies
- hotel room
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

