కేసు నుంచి తప్పించుకునేందుకు ‘చావు’ తెలివితేటలు
యూపీలోని మౌ జిల్లా మున్ఫిపురా మున్సిపాలిటీలో ఊహకందని ఘటన చోటుచేసుకున్నది. ఓ నిందితుడు హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేకకు అంత్యక్రియలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. మున్షిపురా ప్రాంతంలోని రైల్వేలైన్ దగ్గర్లో 2016 డిసెంబర్ 19న యోగేష్ సింగ్‌ను రాజ్ కుమార్ రాజ్‌భర్ హత్యచేశాడు. దానికి ముందు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు.
లక్నో : యూపీలోని మౌ జిల్లా మున్ఫిపురా మున్సిపాలిటీలో ఊహకందని ఘటన చోటుచేసుకున్నది. ఓ నిందితుడు హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేకకు అంత్యక్రియలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. మున్షిపురా ప్రాంతంలోని రైల్వేలైన్ దగ్గర్లో 2016 డిసెంబర్ 19న యోగేష్ సింగ్‌ను రాజ్ కుమార్ రాజ్‌భర్ హత్యచేశాడు. దానికి ముందు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్టు నాటకం ఆడాడు. ఏఐతో తాను చితిమీద పడుకున్న ఫొటోను క్రియేట్ చేశాడు. మేకకు అంత్యక్రియలు చేసి తప్పుడు ఆధారాలతో డెత్ సర్టిఫికెట్ పొందాడు. దాన్ని కోర్టులో సమర్పించి కేసు క్లోజ్ అయిందనుకున్నాడు. ఏడాదిన్నరగా ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అది ఏఐ జనరేటెడ్ ఫొటో అని తేలడంతో పాటు ఫోర్జరీ చేశాడని గుర్తించారు. దీంతో రాజ్‌భర్‌ను అక్టోబర్ 25న అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

