‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను...
– తెలంగాణ హక్కులను కాలరాస్తే ప్రజా ఉద్యమం తప్పదు
– నల్లగొండ రైతు మహాసభల తీర్మానాలు దేశ రైతాంగ పోరాటాలకు దిక్సూచి
– రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాలి
– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు
రామగిరి, నవంబర్ 21 : కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులను హరించాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయంలో రాజకీయ విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీపీఎం పార్టీ, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేసిన ప్రజలు, రైతులు, కార్మికులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధరపై చట్టం చేయాలి
దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మహాసభల్లో కీలక తీర్మానాలు ఆమోదించినట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధంగా అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి తగిన పరిహారం అందించాలని కోరినట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని తీర్మానించామన్నారు.
ప్రజాభీష్టం మేరకే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జూలకంటి రంగారెడ్డి కోరారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే సీపీఎం పార్టీ ప్రజా సంఘాలతో కలిసి బాధిత ప్రజలకు అండగా నిలిచి పోరాటాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, బొప్పాని పద్మ, సీపీఎం, సీఐటీయూ నాయకులు దండెంపల్లి సత్తయ్య, బండా శ్రీశైలం, ఎండీ సలీం, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

