లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని ఈ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు బీజేపీతో వారికి సంబంధాలున్నట్లు ఆరోపించింది. గోసాయిగంజ్ ఎమ్మెల్యే అభయ్ సింగ్, గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్, ఉంచహార్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ పాండేను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎక్స్‌లో పేర్కొంది.
కాగా, ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, మతపరంగా విభజన సృష్టించే ప్రతికూల భావజాల పార్టీతో సంబంధం కలిగి ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆరోపించింది. తమ రాజకీయ వైఖరిని పునఃపరిశీలించేందుకు ఇచ్చిన సమయం ముగిసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీతోపాటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. బహిష్కరించిన ఎమ్మెల్యేలు 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఓటు వేశారని ఎస్పీ ఆరోపించింది.
Also Read:
Patient Dumped In Garbage | క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధురాలు.. చెత్తకుప్ప వద్ద పడేసిన మనవడు
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం
Watch: రేషన్ కోసం గేటు తోసుకెళ్లిన జనం.. తోపులాటలో కొందరికి గాయాలు