తుంగతుర్తి, మార్చి 04 : తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తు దెబ్బతగిలి కాలికి గాయమైంది. దుబ్బాక కిశోర్ ను బుధవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు. అనంతరం మాజీ సర్పంచ్ జటంగి మల్లయ్య తండ్రి పాపయ్య ఇటీవల మరణించడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు, పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, మట్టిపల్లి శ్రీశైలం, తునికి సాయిలు, మలయాల రాములు, శ్రావణ్ పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పరామర్శ