వెల్దండ : మండల కేంద్రంలోని హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై రైతులు బుధవారం ఆందోళన ( Farmers protest ) నిర్వహించారు. సొసైటీకి 700 బస్తాల యూరియా ( Urea ) వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా ఎలా ఇస్తారంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.