కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటిమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను, తన అనుచరులను అరెస్టు చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని.. అక్కడి నుంచి బాలానగర్ పీఎస్కు తరలించారని పేర్కొన్నారు.
నిర్బంధ వాతావరణం సృష్టించి, చుట్టుపక్కలవారికి తీవ్ర అభ్యంతరం కలిగిస్తున్నారని జగన్ పాటిమీది ఆరోపించారు. కూకట్పల్లి నల్లచెరువు సమీపంలోని గ్రామస్తుల పట్టా భూములను ఏవిధమైన నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాక్రాంతంగా తీసుకుందని అన్నారు. వారికి తగిన పరిహారం అందిస్తామని, టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తామని హైడ్రా నమ్మబలికి మోసం చేసిందని తెలిపారు. ఇది జరిగి సంవత్సరం గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. బచ్చుమ్మ అనే గ్రామస్తురాలి ఆత్మహత్యకు పరోక్షంగా కారకులయ్యారని మండిపడ్డారు.
నల్లచెరువు అభివృద్ధి పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వాటికి మెరుగులు దిద్ది, తమ ఖాతాలో వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా చూస్తున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే నల్లచెరువు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే తనను, బాధితులను నిర్బంధించారని అన్నారు. అప్రకటిత 144 సెక్షన్ విధించి కూకట్పల్లిలో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారని విమర్శించారు.
కూకట్ పల్లి గ్రామస్తులను నిర్బంధించి కూకట్ పల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లచెరువు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంలో కూకట్ పల్లి మాజీ కార్పొరేషన్ చైర్మన్ @JAGANBRS పాటిమీది జగన్మోహన్ రావు గారిని వారి అనుచరులను వారి… pic.twitter.com/5u5ZfFYR9w
— Jagan Patimeedi (@JAGANBRS) March 9, 2026