కామారెడ్డి : రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు భరోసా, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.